![]() |
![]() |

కొన్ని సందర్భాల్లో మనుషుల మధ్య వ్యత్యాసం ఇట్టే బయటపడుతుంది. ఏజ్ గ్యాప్ ఉన్న ఇద్దరి మెంటాలిటీ ఒకేలా ఉండదు. అదే అమ్మవాళ్ళ జనరేషన్ కి ఈ జనరేషన్ కి తేడా.. రోహిణి వాళ్ల అమ్మ గురించి చెప్తూ ఓ వ్లాగ్ లో వివరించింది.
తన ఫ్రెండ్ లహరి వాళ్ళ కొడుకు బారసాలకి ఫ్యామిలీతో వెళ్ళిన రోహిణి.. అక్కడ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసింది. కొన్నిరోజుల క్రితం కియా కార్ కొన్నట్టుగా ఓ వ్లాగ్ చేయగా ఆ వీడియోకి విశేష స్పందన లభిస్తోంది. ఇక రోహిణి ఏం చేసిన కాస్త డిఫరెంట్ గా చేస్తోంది. వాళ్ళ అమ్మతో జరిగిన ఓ సంభాషనని వ్లాగ్ గా చేసి చెప్పింది. ఏంటమ్మా కిచెన్ లో జడ వేసుకుంటున్నావని అడుగగా.. ఇక్కడ అద్దం ఉందని చేసుకుంటానని రోహిణి వాళ్ళ అమ్మ అంది. అయ్యో అమ్మ డ్రెస్సింగ్ టేబుల్ కి అంత పెద్ద అద్దం ఉండగా ఇక్కడ ఎందుకని అడిగింది రోహిణి. నేనంతే అని వాళ్ళ అమ్మ అంది. ఇక బయటకు వెళ్ళేప్పుడు రెడీ అయ్యాక కనకాంబరాల పూలు అల్లుకుందని రోహిణి చూపించింది. వీటి గురించి నీకు తెలియదంటూ రోహిణి వాళ్ళ అమ్మ అనేసింది. అయ్యో ఏంటో ఏమో అందరి ఫ్యామిలీ వేరు.. మా ఫ్యామిలీ వేరు. తికమక ఫ్యామిలీ అంటే మాదేనేమో అంటు రోహిణి అంది. ఇదంతా యూట్యూబ్ లోని తన ఛానెల్ లో అప్లోడ్ చేసింది. కాగా ఈ వీడియోకి విశేష ఆదరణ లభిస్తోంది.
సీరియల్స్, షోస్, ప్రోగ్రామ్స్ లలో మెప్పించటం ద్వారా గుర్తింపు సంపాదించుకుంటోన్న లేడీ ఆర్టిస్టుల్లో రోహిణి ఒకరు. ఒక టీమ్ మెంబర్ గా జబర్దస్త్‌లోనూ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టీమ్ లీడర్ గా మారిందంటే తన కామెడీ టైమింగ్ తో పంచులతో ఎంతలా మెప్పిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చేతినిండా అవకాశాలతో రోహిణి ఫుల్ బిజీగా ఉంటోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజైన 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసింది రోహిణి. ఇందులో తన కామెడీకి బాగానే మార్కులు పడ్డాయి. దాంతో తనకి ఆఫర్లు వరుసగా వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వరుసగా మూడవ కార్ కూడా కొంది. అయితే తన ఫ్యామిలీతో పాటు రీల్స్, వీడియోలు చేస్తూ ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటుంది రోహిణి.
![]() |
![]() |